Sunday, March 9, 2025

‘మ‌హారాణి’ సీజ‌న్ 4.. టీజ‌ర్ విడుద‌ల‌

మ‌న ఓటీటీ మాధ్య‌మాల్లో అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ఒక‌టి ‘మహారాణి’. అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సిరీస్ నుంచి నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ న‌టి హ్యుమా ఖురేషి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌టం మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ‘మహారాణి’ సీజ‌న్ 4కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగిన రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) జీవిత ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే సిరీస్ ఇది. ఈ వ్య‌వ‌స్థ‌లో ఆమెకు ఎదురైన స‌వాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్ర‌లు, రాజ‌కీయ వైరుద్ధ్యాలు ఇందులో మ‌నం చూడొచ్చు. ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన గ‌త మూడు సీజ‌న్స్ త‌ర‌హాలోనే నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. టీజ‌ర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ రానున్న సీజ‌న్ 4పై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com