Wednesday, March 12, 2025

సిఎంకు చెక్కులను అందచేసిన హీరో మహేశ్‌బాబు

హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం సిఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. వరద బాధితుల సహాయార్ధం సిఎం రిలీఫ్ ఫండ్‌కు మహేశ్ దంపతులు ప్రకటించిన రూ.50 లక్షలు చెక్కును వారు సిఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందించారు. ఎఎంబి సినిమాస్ తరఫున కూడా మహేష్ మరో రూ.10 లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు ప్రకటించి సంబంధిత చెక్కులను స్వయంగా సిఎంను కలిసి అందిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి చెక్కులు అందించగా తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున మరో రూ.50 లక్షల చెక్కులను సిఎం రేవంత్‌కు అందించారు. బాలకృష్ణ, విశ్వక్‌సేన్, సాయిధరమ్ తేజ్, అలీ తదితరులు కూడా ఇప్పటికే సిఎంకు తమ విరాళాల చెక్కులను అందించిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com