Friday, May 2, 2025

మేకర్స్‌కు మహేష్‌ రిక్వెస్ట్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. 2024లో సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకున్నా భారీ వసూళ్లను సాధించింది. అయితే మహేష్ తన నెక్స్‌ట్‌ మూవీ దర్శక ధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్‌మెంట్స్‌ రాకపోయినా.. ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు.. భారీగా మేకోవర్ చేసుకుంటున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఇప్పటికే అనేక సార్లు కనిపించారు. దీంతో మహేష్‌బాబు 29వచిత్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లుక్ లో సందడి చేయనున్నట్లు అర్థమవుతోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఆ సినిమా.. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల అవ్వనుంది. దుర్గా ఆర్ట్స్‌ పై నిర్మాత కేఎల్‌ నారాయణ భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు.. ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ మూవీలో కూడా నటించలేదన్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి తీయబోయే సినిమాతోనే బీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వాలని మన సూపర్ స్టార్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తాను ఇప్పటికే నటించిన సినిమాలను హిందీలోకి డబ్ చేయవద్దని ఆయా చిత్రాల నిర్మాతలను మహేష్ కోరారట. ఇప్పుడు ఈ విషయంలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మహేష్ బర్త్ డే రోజు.. రాజమౌళి ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఆ రోజు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో నిరాశ చెందారు. కానీ తమ ఫేవరెట్ హీరో.. పాన్ వరల్డ్ రేంజ్ లో సందడి చేయనున్నారని ఖుషీ అవుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com