Monday, April 21, 2025

వినేష్ ఫోగట్ కు మద్దతు తెలిపిన మహేశ్ బాబు

  • వినేష్ ఫోగట్ కు మద్దతు తెలిపిన మహేశ్ బాబు
  • మీరు నిజమైన ఛాంపియన్ అంటు ట్వీట్

భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అండగా నిలబడ్డారు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడారు మహేశ్. ఈ మేరకు మహేశ్ బాబు సోషల్ మీడియా ట్విట్టర్-ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో వినేష్ ఫోగట్ కు మహేశ్ ఏంచెప్పారంటే.. ఈ రోజు రిజల్ట్ తో సంబంధం లేదు.. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం.. వినేశ్ ఫోగాట్.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు.. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.. పతకం వచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు.. మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది.. 1.4 బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి.. అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మహేశ్ బాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు భావించారు. ఐతే దురృష్టవశాత్తు వినేష్ ఫోగట్ తన శరీర బరువు 50 కిలోల కంటే ఎక్కువ ఉన్నందున చివరి దశలో అనర్హులిగా ప్రకటించడం తీవ్ర నిరాశ కలిగించింది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వినేష్ ఫోగట్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రధాని మోదీతో పాటు మహేశ్ బాబు, అలియా భట్, సమంత, తాప్సీ పన్ను, కరీనా కపూర్, ఫర్హాన్ అక్తర్ వినేష్ ఫోగట్ కు ధైర్యం చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com