క్లాస్ లుక్ తోనూ మాస్ ని మెప్పిస్తాడు మహేష్ బాబు. క్లీన్ షేవ్ తో సాఫ్ట్ గా కనిపించినా.. తన డైలాగ్ డెలివరీ, ఆటిట్యూడ్ తో మాస్ చేత ఈలలు కొట్టించగల సత్తా ఉన్న హీరో మహేష్. అలాంటి మహేష్ బాబు.. మొదటిసారి పూర్తిగా తన లుక్ ని మార్చేశాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ పొడవాటి జుట్టు, గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. షూట్ లొకేషన్ లోని మహేష్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఫ్యాన్స్ కి ఆయన మరో ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. ఈ మూవీలో ఆయన షర్ట్ లెస్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
మహేష్ తోటి స్టార్స్ అందరూ దాదాపు షర్ట్ లెస్ ఫైట్స్ చేశారు. సిక్స్ ప్యాక్ లు చూపించారు. మహేష్ వర్కౌట్స్ చేస్తాడు, ఫిట్ గా ఉంటాడు. కానీ, ఎప్పుడూ సినిమాల్లో షర్ట్ లెస్ గా కనిపించలేదు. అలాంటి మహేష్.. మొదటిసారి రాజమౌళి కోసం తన రూట్ మార్చాడు. ఇందులో మహేష్ చొక్కా విప్పి ఫైట్ చేస్తాడట. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలవడమే కాకుండా, మహేష్ కెరీర్ లోనూ బెస్ట్ ఫైట్ గా నిలవనుంది అంటున్నారు.