సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అనేది వంశపారంపర్యం ఈ విషయం కొత్తేమి కాదు. కొంత మంది పిల్లలు సినిమాల పై పెద్దగా ఇంట్రస్ట్ చూపకపోయినా కొంతమంది పిల్లలు మాత్రం నటనపై చిన్నప్పటి నుంచే మొగ్గు చూపుతుంటారు. అంతేకాక వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ వారసుడిగా వచ్చి సూపర్‌స్టార్స్‌గా ఎదిగిన తరహాలో ఇప్పుడు ఇంకో స్టార్ వారసుడి ఎంట్రీపై బజ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీర్‌న్స్ ఇచ్చిన గౌతమ్, ఇప్పుడు అసలైన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఈ మైమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాండిల్ లైట్ డిన్నర్ సన్నివేశాన్ని మాటలు లేకుండా భావోద్వేగాలతో అందించడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ఇందులో గౌతమ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నవ్వు, కోపం, బాధ వంటి ఎమోషన్లు గౌతమ్ ఎలాంటి డైలాగ్స్ లేకుండానే చాలా క్లాస్‌గా ప్రెజెంట్ చేయగలగడం ఆకట్టుకునే అంశం. ఈ ప్రదర్శనను సీరియస్‌గా తీసుకుంటే, ఆయన కెరీర్‌కు ఇది మంచి బేస్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మైమ్ వీడియోను సెరాఫీనా జెరోమీ డైరెక్ట్ చేయగా, గౌతమ్‌తో పాటు కాశ్వీ రమణి కీలక పాత్రలో కనిపించింది. గౌతమ్ నటించిన ఈ వీడియో చూసిన తర్వాత, “ఇదే ప్రారంభమై ఉండొచ్చు.. ఓ న్యాచురల్ స్టార్ వారసుడు సిద్ధమవుతున్నాడు” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.