పుష్ప… ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ప్రస్తుతానికి దేనికీ లేదనే చెప్పాలి. ఏకంగా ఇది ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చిత్రానికి మంచి అప్లాజ్ వచ్చింది. పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదేలే అనే ఈ సంభాషణతో పాటు ఈ చిత్రంలో పుష్పరాజ్ స్వాగ్‌ను ఎంతో మంది సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా అనుకరించారు.
ఇక తొలిపార్ట్‌కు లభించిన ఉత్సాహాంతో.. రెట్టించిన ఎనర్జీతో అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో ‘పుష్ప ది రూల్’ ను కూడా స్టార్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తొలిభాగానికి మించిన బిజినెస్ క్రేజ్ ‘పుష్ప-2’ కు వచ్చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఆహార్యం, యాస, పుష్ప రాజ్ స్వాగ్ ఇలా అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దాదాపు రూ. 1000 కోట్ల ప్రీ బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదల కాబోతుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘రంగస్థలం’ లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం ‘పుష్ప’ను హీరో మహేశ్ బాబుతో చేయాలి అనుకున్నాడు. ‘పుష్ప’ కథను విన్న ఆయన చాలా కాలం ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ కూడా మహేశ్ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో మహేశ్ బాబు వేరే దర్శకుడితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
ఈ సమయంలోనే వంశీ పైడిపల్లితో ‘మహర్షి’, అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలను అంగీకరించాడు మహేశ్. ఇక సుకుమార్ వెయిట్ చేయడం ఇష్టం లేక ‘పుష్ప’ కథతో వెంటనే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిపోయాడు. కథ వినగానే బన్నీ కూడా ( అల్లు అర్జున్) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ‘పుష్ప’ చిత్రం అల్లు అర్జున్ హీరోగా సెట్స్ మీదకు వెళ్లింది. మరి అంత మాస్ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేక మహేష్ ఒప్పుకోలేదా.. లేక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుంది.