Tuesday, November 19, 2024

బుద్ధ వెంకన్న పై పోతిన మహేష్ ఆరోపణలు సరికాదు

  • బుద్ధ వెంకన్న పై పోతిన మహేష్ ఆరోపణలు సరికాదు
  • తెలుగుదేశం కార్పొరేటర్ ఉమ్మడి చంటి విమర్శ

విజయవాడ ,సెప్టెంబర్ 14 : దుర్గ గుడి పార్కింగ్ వ్యవహారంలోనూ, షాపుల లీజుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నాలుగు కోట్ల రూపాయల మేర లబ్ది పొందారని వైసీపీ నాయకులు పోతిన మహేష్ ఆరోపణలు చేయడం సరికాదని తెలుగుదేశం కార్పొరేటర్ ఉమ్మడి చంటి తీవ్రంగా ఖండించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుద్ధ వెంకన్న పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని మహేష్ ను హెచ్చరించారు. గతంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును అవినీతిపరుడని విమర్శించిన పోతిన మహేష్ నేడు వెల్లంపల్లి వెంటే తిరుగుతున్నాడని విమర్శించారు. నాటి మాజీ మంత్రి వెల్లంపల్లి అక్రమంగా దుర్గ గుడిలో 60 మందిని తీయించి వారి పొట్ట కొట్టారని అన్నారు.

తెలుగుదేశం నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజు మాట్లాడుతూ ప్రజల మనిషి అయిన బుద్ధ వెంకన్న పై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని పోతిన మహేష్ ను హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు దుర్గగుడి షాపుల లీజు దారులు మాట్లాడుతూ తమకు గత వైసిపి ప్రభుత్వం ఘోరమైన అన్యాయం చేసిందని విమర్శించారు. 54 వేల రూపాయలు ఉండే షాపుల అద్దెలను ఒక్కసారిగా లక్ష ఆరువేల రూపాయలు వరకు పెంచేశారని ధ్వజమెత్తారు. తమకు బుద్ధ వెంకన్న దేవుడు లాంటి వాడని, తమ సమస్యల పరిష్కారానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం నాయకులు, షాపుల లీజు దారులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular