బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన మహిరా శర్మ ఏక్తా కపూర్ తో 2018 లో అరంగేట్రం చేసింది. గత ఏడాది వచ్చిన లెహంబర్గిన్ని లోని నటనకు గాను విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతే కాకుండా గత ఏడాది వెబ్ షో బజావో లో కూడా సందడి చేసి ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం అందరికి తెల్సిందే. బుల్లి తెర సూపర్ హిట్ రియాల్టీ షో హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో కూడా ఈ అమ్మడు సందడి చేసింది. అంతే కాకుండా సీజన్ లో మహిరా ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది. బిగ్ బాస్ కి ముందు కూడా బుల్లితెర ప్రేక్షకులకు మహిరా వినోదాల విందును సీరియల్స్ ద్వారా అందించి ఆకట్టుకుంది. నాగిన్, ఏక్తా కపూర్ షో లతో పాటు ఎన్నో మ్యూజిక్ వీడియోల్లో కనిపించింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకునే మహిరా మరోసారి తన క్లీ వేజ్ షో అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. ఈసారి సైడ్ యాంగిల్ లో స్కిన్ షో చేసి చూపు తిప్పుకోనివ్వడం లేదు. ముద్దుగుమ్మ మహిరా శర్మ యొక్క ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిగా మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా సినిమాలతో కూడా బిజీ అయ్యే అకవాశాలు ఉన్నాయి.