Monday, April 21, 2025

హీరోని అమ్మతో పోల్చిన మాళవికమోహనన్‌

టాలీవుడ్‌లో ప్రభాస్‌ క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డార్లింగ్‌ అంటే కేవలం అభిమానులకే కాదు తనతో నటించే తోటి నటీనటునులకు కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే ప్రభాస్‌ అందరితో చాలా చక్కగా కలిసి పోతారు. అంతేకాక ఎవరికైనా సహాయం చెయ్యడంలో ముందు ఉంటాడు. ఆయన ఆదరించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ప్రభాస్ తో సినిమా చేసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని ఒక విషయంలో తెగ పొగుడుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ రాజా సాబ్ మూవీలో నటిస్తున్న మాళవిక మోహనన్ అతని ఏకంగా ఆమె తల్లి తోటి పోల్చింది.

ప్రభాస్ తో కలిసి పనిచేసే ఎవ్వరైనా సరే ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడాలి అంటే ఆయన పెట్టే భోజనం గురించి ప్రస్తావిస్తారు. గతంలో ప్రభాస్ తో సలార్ చిత్రంలో నటించిన పృథ్వీరాజ్ కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒకసారి పృథ్వీరాజ్‌ని కలవడానికి అతని భార్య ,కూతురు వచ్చారు. పాపకు ఏమి ఫుడ్ ఇష్టమో తెలుసుకున్న ప్రభాస్ పాప కోసం స్పెషల్ గా ఇంటిదగ్గర నుంచి వంటలు చేయించి పంపించారు. ఇక ప్రభాస్ పంపించిన భోజనం కోసం పృథ్వీరాజ్ సెపరేట్‌గగా ఒక రూమే తీసుకోవాల్సి వచ్చిందట. ప్రభాస్ పెట్టే భోజనం లెవల్ ఎలా ఉంటుందో తెలియడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

అందుకే రాజు రాజే ఎక్కడున్నా రాజే అంటారు అభిమానులు. తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ కూడా యాడ్ అయింది. ప్రభాస్ తో కలిసి రాజా సాబ్ మూవీలో నటిస్తున్న తమిళ్ బ్యూటీ మాళవిక మోహనన్ విక్రమ్ తంగలాన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ తన కోసం హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ పంపారు..మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో బెస్ట్ ఫుడ్ కూడా అదే. ప్రభాస్ సార్ వల్ల నేను ఇక్కడ షూటింగ్ లో ఉన్నా మా అమ్మ ఫుడ్ మిస్ అయింది అన్న ఫీలింగ్ నాకు రాలేదు.. అంటూ ఈ బ్యూటీ ప్రభాస్ ను తెగ పొగిడేసింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com