Monday, March 10, 2025

అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ ‘వడక్కన్’

కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్థానం సంపాదించుకుంది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై వడక్కన్‌ను నిర్మించారు. ఈ చిత్రం ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది. మస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా అతీంద్రియ థ్రిల్లర్ రంగాల్లోకి లోతుగా పరిశోధిస్తుంది.

Malayali movie Vadakkan on Brussels International Fantastic Film Festival

తమ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నాడు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనది. మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత, జైదీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూ మద్దతు ఉన్న గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్‌ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం’ అని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com