అయ్యా.. నేనే.. మాజీ మంత్రిని కూడా : మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా.. నేనే మల్లారెడ్డిని.. మాజీ మంత్రిని అంటూ కొత్తగా పరిచయం చేసుకున్నట్లుగా చూపించారు. నేను మల్లారెడ్డి అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. తాను రెండు విషయాలు చేప్తానని, అందులో ఒకటి ప్రభుత్వానికి పదుకొండ వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని అన్నారు. రెండోది తన మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల, సర్పంచ్ ల బాధలన్నారు. ఇది చెప్తుండగానే స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. మల్లారెడ్డి మళ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి
అయితే, ఈ రెండు అంశాల్లో ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్ అన్నారు. దీంతో సభలో అందరూ నవ్వారు. మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి తగిలినట్లుందని.. 61 గ్రామాలు పోయి అన్నీ మున్సిపాలిటీలు అయిపోయని మల్లారెడ్డి అన్నారు. మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలుండగా.. మరో మూడు మున్సిపాలిటీలు చేశారని.. దయచేసి తమకు సేమ్ రిజర్వేషన్ ఉంచాలని, మమ్మల్ని జీహెచ్‌ఎంసీలో కలపొద్దంటూ మంత్రి శ్రీధర్ బాబును మల్లారెడ్డి కోరారు. ఇక ప్రభుత్వానికి పదుకొండ వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదానిపై మాల్లారెడ్డి మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు.