ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ యొక్క వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక 2025 ఈ ఏడాది విజయ్ దేవరకొండ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారని మరింత ప్రత్యేకంగా జరిగింది. సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్ లో ఈ వేడుక మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సిహెచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డి గారు యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛైర్మన్, డా. భద్రారెడ్డి గారు , మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛైర్మన్, డా. సిహెచ్ ప్రీతి రెడ్డి గారు , మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నితిన్ , స్టార్ హీరో తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎప్పటికప్పుడు చెబుతుంటారు పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానని, దేశం గర్వించదగిన మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, కానీ అందులో అంతకన్నా ఆయనకు విద్యార్థుల ప్రేమ ఎంతో విశేషమైనదని అన్నారు. “మనకు నచ్చిన పనిని చేస్తే మనం నిజంగా సంతోషంగా ఉంటాము. అందుకే సినిమాల షూటింగ్ సమయంలో సంతోషంగా ఉంటాను, సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇంకా ఆనందంగా ఉంటాను” అని విజయ్ దేవరకొండ అన్నారు.