రంగుల ప్రపంచంలో సెలబ్రెటీల జీవితాలు విచిత్రంగా ఉంటాయి. రాజ్ తరుణ్, లావణ్య కేసులో నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రాజ్ తరుణ్‌తో తాను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పలువురు యువతుల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని మస్తాన్‌సాయి అంటున్నాడు. హార్డ్ డిస్క్‌లో ఉన్నాయి తన భార్య గర్ల్‌ఫ్రెండ్ వీడియోలని చెబుతున్నాడు. అవి 2017లో తీసుకున్నామని తెలిపాడు. అయితే హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాండి ఎవిడెన్స్ ఉన్నాయని అవి మాయం చేసేందుకే లావణ్య హార్డ్ డిస్క్‌ని దొంగిలించిందని తెలిపాడు. వ్యక్తిగత డిమాండ్ల కోసం లావణ్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని వెల్లడించారు.