- ఆ రెండు పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది
- నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి మల్లు రవి
బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే చెబుతుందని, కానీ, నేటితో అది నిజమని తెలిసిపోయిందని ఆయన విమర్శించారు.
ALSO READ: విహెచ్ ప్రెస్‌మీట్‌లకు లైవ్ లింక్ కట్..!
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మొత్తం సీట్లు గెలవడం కోసం బిఆర్‌ఎస్ డమ్మీ అభ్యర్థులను ఎంపిక చేసిందని వారిని చూసిన తరువాత అర్ధం అవుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయం ప్రజలు గమనించాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్,- బిజెపిలకు గుణపాఠం నేర్పించి తెలంగాణలో ఉన్న 17 సీట్లకు గాను 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ణప్తి చేశారు.