మోహన్‌బాబు అంశంలో మంచు విష్ణు సంచలన కామెంట్స్
మంచు కుటుంబం వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. మనోజ్, మోహన్ బాబు, విష్ణు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన మనోజ్.. విష్ణు, వినయ్‌లపై ఆరోపణలు చేశారు. బుధవారం సాయంత్రం మరికొన్ని కీలక వివరాలు ప్రకటిస్తానని అనౌన్స్ చేశారు. తాజాగా విష్ణు మీడియా ముందుకు వచ్చారు. సంచలన కామెంట్స్ చేశారు. ” మా నాన్న మమ్మల్ని ప్రేమించడమే ఆయన చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. మీడియాకు క్షమాపణలు చెప్తున్నానని, దాడిలో గాయపడిన జర్నలిస్టు కుటుంబంతో టచ్‌లో ఉన్నామంటూ విష్ణు ప్రకటించారు.
‘మా అమ్మకి ఇవ్వాళ ఆరోగ్యం బాగోలేదు. మా నాన్న నిన్నటి ఇష్యూలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. నేను కన్నప్ప షూటింగ్‌లో ఉన్నాను. గొడవల వల్ల నేను షూటింగ్ ఆపేసి వచ్చేసాను. ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను. నిన్న ఒక జర్నలిస్టుకి గాయాలు అయ్యాయి. చాలా దురదృష్టకరం. దానికి చింతిస్తున్నాము. నిన్న తండ్రిగా ఆయన తపన చూడండి. దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారు అని కోపంతో అలా చేశారు. అలా జరిగి ఉండకూడదు. మాకు నోటీసులు రాకముందు పోలీసులు మీడియాకి విడుదల చేసారు. అది ఎలా సాధ్యం అవుతుంది. ఈరోజు ఉదయం గన్ సబ్మిట్ చెయ్యాలని చెప్పారు. మీడియాలో నిన్న విడుదల చేశారు. ఇవ్వాళ 9.30కి నోటీసు ఇచ్చి పదిన్నరకి హాజరు కావాలని అంటే ఎలా?’ అని విష్ణు ప్రశ్నించారు.
క్షమించండి
‘జర్నలిస్టుపై దాడి విచారకరం. జర్నలిస్ట్‌పై దాడిని ఖండిస్తున్నా. మా నాన్న తప్పు చేసుంటే క్షమించాలి. ఆయన మీడియాతో చాలా గౌరవంగా ఉంటారు. తరాలుగా మా నాన్న అంటే ఏంటో అందరికీ తెలుసు. సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని గొడవలు వచ్చాయి. చివరికి అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించటమే మా నాన్న చేసిన తప్పు. మేం కలిసిమెలసి ఉందామని అనుకున్నాం. నిన్నటి దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. గొడవలతో మా అమ్మ ఆస్సత్రి పాలైంది. గేట్లు పగలగొట్టి మనోజ్ ఇంట్లోకి వచ్చాడు.’ అని విష్ణు అన్నారు.