Saturday, April 5, 2025

యాపిల్ సంస్థ కారణంగా నా భార్య విడాకులు ఇచ్చింది

* యాపిల్ సంస్థ కారణంగా నా భార్య విడాకులు ఇచ్చింది
* 53 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని పిటీషన్
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్ కారణంగా పచ్చని సంసారంలో చిచ్చు రేగింది. యాపిల్ లోని లోపం కారణంగా ఓ జంట విడిపోవాల్సి వచ్చింది. ఓ వ్యక్తి తన ఐమ్యాక్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు  అతని భార్య కంట పడటంతో ఆమె భర్తపై అగ్గిమీదగుగ్గిలం అయ్యింది. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ వ్యవహారం చివరికి విడాకులకు దారితీసింది. ఇంతకీ ఐమ్యాక్ లో భర్త డిలీట్ టేసిన మెస్సేజ్ లు ఏంటి, అందులో అంతగా ఏముంది, అసలేం జరిగిందన్న కుతూహలం కలుగుతోంది కదా.. ఐతే ఈ కధనాన్ని చదివేయంది..
లండన్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఐఫోన్‌ లోని ఐ మెసేజ్ యాప్ నుంచి తన భార్యకు తెలియకుండా  కొంత మంది వేశ్యలతో చాటింగ్ చేశాడు. అంతే కాదు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఫోన్‌ లోనే రాసలీలలు నెరిపాడు. ఐతే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఫోన్ లోని మెసేజ్‌ లన్నీ డిలీట్‌ చేశాడు. ఇదే యాపిల్‌ ఐడీని తన ఐమ్యాక్‌ లోనూ ఉపయోగించాడా బిజినెస్ మ్యాన్. దీంతో ఐఫోన్‌ లో మెసేజ్‌లు డిలీట్ చేసినా ఐమ్యాక్‌ లో మాత్రం అలాగే ఉండిపోయాయన్న సంగతి అతనికి తెలియదు పాపం. ఓ రోజు అతని ఖర్మ కొద్దీ ఆ మెసేజ్‌లు అతని భార్య కంటపడ్డాయి.
ఇంకేముంది భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతని భార్య.. చివరికి అతనితో తెగదెంపులు చేసుకునేంది. కోర్టు ద్వార భర్త నుంచి విడాకులు సైతం తీసుకోవడంతో వాళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. అందుకే తన కాపురం కూలిపోవడానికి యాపిల్ సంస్థే కారణమని కంపెనీపై దావా వేశాడు. తన ఫోన్‌ లో మెసేజ్‌లు డిలీట్‌ చేసినపుడు అవి పూర్తిగా డిలీట్ అయిపోయాయని అనుకున్నానని, కానీ లింక్‌ చేసిన అన్ని డివైజ్‌లలో మెసేజ్‌లు ఉండిపోతాయనే విషయం యాపిల్‌ సంస్థ యూజర్లకు స్పష్టంగా చెప్పలేదని కోర్టుకు విన్నవించాడు. కేవలం దీని కారణంగానే తాను డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చూసి తన భార్య విడాకులు ఇచ్చిందని కోర్టులో బోరున విలపించాడు.
యాపిల్ కంపెనీ చేసిన నిర్వాకం వల్ల తాను తన భార్యకు విడాకులివ్వాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తాను 5 మిలియన్‌ పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు 53 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు కోర్టుకు విన్నవించాడు. తన ఫోన్ లో తాను డిలీట్ చేసిన మెస్సేజ్ లు భార్య చూడటం వల్లే విడాకులు ఇచ్చిందని పేర్కొన్న ఆ వ్యక్తి.. ఇందుకు గాను యాపిల్‌ సంస్థ తనకు 53 కోట్లు చెల్లించాలని కోర్టులో వేసిన దావాలో పేర్కొన్నాడు. ఇక ఈ పిటిషన్‌ పై కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుండగా, ఎలాంటి తీర్పు ఇస్తుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com