ఫామ్ హౌస్ లో బెడిసిన మోహన్‌బాబు తీర్పు
మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు మోహన్ బాబు కూడా కొడుకు మనోజ్, కోడలు మౌనికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా తాజాగా మోహన్ బాబు ఫామ్ హోస్ జరిగిన ఓ ఘటనకు సంబంధించిన విషయం వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫాంహౌస్‌లో పెద్ద కూర్చి వేసుకుని కూర్చొని గొడవను సద్దుమణిగించే ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. కానీ, ఆస్తి పంపకాల్లో పెదరాయుడి తీర్పు బెడిసికొట్టిందని టాక్.
ఎందుకు అలా..?
తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో.. ఒక ఫొటో ప్రకారం.. మోహన్ బాబు ఆదేశం ప్రకారం బౌన్సర్ ఓ వ్యక్తిని కొడుతున్నాడు. అయితే అతను మనోజా కాదా అనేది సరిగా కనిపించలేదు. బౌన్సర్ మోహన్ బాబు ముందే ఇద్దరిపై దాడి చేశాడు. చెంపపై కొడుతూ.. సెల్ ఫోన్లను లాక్కున్నారు. పెద్దరాయుడి లాగా మోహన్ బాబు కుర్చిలో కూర్చుని ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు మోహన్ బాబు ఇంకా పెదరాయుడు ఫోబియాలో ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు. మోహన్ బాబు గారు ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా అని కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లను మోహరించారు. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన పెద్ద కుమారుడు విష్ణు అక్కడున్న బౌన్సర్లను బయటకు పంపారు. బయటకు పంపిన వారిని మనోజ్ బౌన్సర్లుగా చెబుతున్నారు. అదే సమయంలో మంచు మనోజ్ గేటు వద్ద ఉన్నాడు. తన బౌన్సర్లను బయటకు పంపడంపై మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం నుంచి మంచు ఫ్యామిలీ గొడవలు డైలీ సీరియల్ గా మారాయి. ఆదివారం ఉదయం తండ్రిపై మంచు మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మంచు ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం మనోజ్ ఆస్పత్రికి వచ్చారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు కూడా తనకు ప్రాణ హానీ ఉందని ఫిర్యాదు చేశారు.