Friday, April 18, 2025

మళ్లీ మంచు పంచాయతీ ఆస్తి కోసం రాలేదన్న మనోజ్

సినీనటుడు మోహన్‌ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా తన కారు పోయిందని హీరో మంచు మనోజ్ డ్రైవర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మోహన్​బాబు ఇంటికి మంచు మనోజ్​ వచ్చే అవకాశముందన్న ఆలోచనతో భారీగా పోలీసులను మోహరించారు. మనోజ్​ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటనే బైఠాయించారు. అక్కడ మాట్లాడిన ఆయన తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఎలాంటి గొడవలు లేవని, కావాలనే అందరిని పిచ్చోళ్లు చేస్తున్నారని, ఏప్రిల్ 2న తన కుమార్తె పుట్టిన రోజు, ఇక్కడ పరిస్థితులు బాగోలేదని జయపుర వెళ్లామని మనోజ్‌ చెప్పారు. కానీ, ఇప్పుడు తన ఇంట్లోకి నేను వెళ్లడానికి పర్మిషన్‌ తీసుకుని రావాలి అంటున్నారని, ఇంట్లో పెంపుడు జంతువులు, ఇతర వస్తువులు ఉన్నాయి. వాటికోసమే వచ్చానన్నారు. ఏ రోజూ తాను ఆస్తి కోసం గొడవ పడలేదని, తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. కోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలికి పంపించడం లేదన్నారు.

ఇంట్లో లేని సమయం చూసి తీసుకెళ్లారు
మంచు మనోజ్ తన కారు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టిన రోజు వేడుకల మనోజ్ కోసం జయపుర వెళ్లడాన్ని ఆయన సోదరుడు విష్ణు అవకాశంగా తీసుకుని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ” ఈ నెల 1వ తేదీనా మా పాప పుట్టిన రోజు సందర్భంగా జైపూర్ వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందిలో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రిని ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. నా కారును దొంగలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారు. జల్‌పల్లిలో నా భద్రత సిబ్బందిపై దాడి చేశారు. కమిషనర్ ఇచ్చిన బైండోవర్‌ను వాళ్లు ఎన్నో సార్లు దాటారు. నేను తప్పు చేశానని, ఆస్తి ఆడిగానని ఒక్క సాక్ష్యాధారం బయటపెట్టండి. అప్పుడు వాళ్లందరి కాళ్లపై పడి క్షమాపణ కోరతా.” అని మంచు మనోజ్ అన్నారు.

తనకు ఆస్తి వద్దని తన తండ్రికి ఎప్పుడో చెప్పారని, ఇది ఆస్తి గొడవ కాదని మంచు మనోజ్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఇదంతా అని అక్కడే గొడవ మొదలైందని తెలిపారు. డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటివరకూ ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదని ఫైర్‌ అయ్యారు. కత్తులు, గన్‌లతో రౌడీలు వారిని కొట్టాడానికి వచ్చారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు.

పోలీసులు పట్టించుకోవడం లేదు
కారు చోరీ గురించి పోలీసులకు చెబుతున్నా యాక్షన్ తీసుకోవడం లేదని తెలిపారు. నా సెక్యూరిటీ ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన ఇంట్లోకి తను వెళ్లడానికి ఆర్డర్‌ కావాలని పోలీసుల అడుగుతున్నారని, మోహన్‌బాబు చెబితేనే లోపలికి పంపిస్తానని అంటున్నారని తెలిపారు. కోర్టు నోటీసులు ఇచ్చినా లోపలికి పంపించడం లేదని ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. “నా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఒక్కరుపాయి కూడా తీసుకోలేదు. బయట ప్రొడెక్షన్‌లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయాల్సిందేనని అనేవారు. విష్ణు కెరీర్ నిలబెట్టడం కోసం లేడీ గెటప్‌ కూడా వేశాను. వాళ్ల కోసం ఎంతో గొడ్డు చాకిరీ చేశా. అయినా ఎందుకు ఇంతలా దిగజారుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దాం అనుకున్నాం. టెన్షన్ పడిపోయి ఆ సినిమాను వాయిదా వేశారు. ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు నా తల్లిదండ్రులకు ఈ తలనొప్పులు అవసరమా? విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా” అని మనోజ్ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com