విష్ణుపై ఆసక్తికర ట్వీట్ చేసిన మనోజ్..
మంచు ఫ్యామిలీ మధ్య ఘర్షణలు తగ్గుతున్నట్లే కనిపిస్తున్నా.. ఏదో ఓ రూపంలో మళ్లీ మొదటికి వస్తున్నాయి. వివాదాలకు పరిష్కారం వెతికేందుకు ఎవరికీ సాధ్యం కావడం లేదు. తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ ఇంట్రస్ట్ పెంచుతోంది. దీంతో మంచు కుటుంబంలో వివాదాల ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటీకే కేసుల పరంపరం కొనసాగుతుండగా.. తాజాగా మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చర్చలకు అన్న విష్ణును ఆహ్వానిస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు. ‘రండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తాను. ఏ ప్లేస్‌కైనా వస్తాను. ఎవరినో అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు.
నాన్నని, మహిళ, సిబ్బందిని అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. మన వద్ద ఉన్న సమస్యకు ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం.’ అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ఇక శుక్రవారం నాడు ఒక ట్వీట్ చేసిన మనోజ్.. అందులో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మాదిరిగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని పోస్ట్ చేసిన మనోజ్.. ఆ పోస్టుకు విష్ణును ట్యాగ్ చేశాడు.
దీందో మంచు కుటుంబంలో వివాదాలు ఒక దాని వెంట ఒకటి బయట పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందిటే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మంచు మనోజ్ ఎంబీ యూనివర్సిటీ సందర్శనకు వెళ్లడంతో వివాదం మళ్లీ రాజుకుంది. మంచు ఫ్యామిలీలో గత నెలలో వివాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వచ్చాయి. పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. కేసులు, కోర్ట్ ల వరకు వెళ్లింది. ఈ క్రమంలో సెటిల్ అయ్యిందని, గొడవ సర్దుమనిగిందని అనుకున్నారు. కానీ సడెన్‌గా ఇప్పుడు అగ్గిరాజేస్తుంది. వివాదం మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఆయన మోహన్‌బాబు యూనివర్సిటీని సందర్శించడం కోసం వెళ్లడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
మొదట రేణిగుంట వివామానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి ర్యాలీగా యూనివర్సిటీకి వెళ్లాడు. మంచు మనోజ్‌ని యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతించలేదు. ట్రస్ట్ వివాదం కేసు కోర్ట్ లో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా అర్థం చేసుకున్నాడు. వెనుతిరిగాడు. అయితే తన తాతయ్య, నానమ్మ సమాధులను కూడా సందర్శించడానికి వీలు లేకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనోజ్ లోపల ఉన్నవారిపై గట్టిగా అరిచాడు. పోలీస్ పై అధికారులతో మాట్లాడారు. మొత్తంగా పోలీసుల సపోర్ట్ తో మంచు మనోజ్ లోపలికి వెళ్లి తాత, నాన్న సమాధులను సందర్శించి దెండం పెట్టుకుని వచ్చారు. ఈ వివాదం సాగుతుండగానే.. ఇప్పుడు మనోజ్ చేసిన ట్వీట్ మళ్లీ సంచలనంగా మారింది.