Thursday, June 5, 2025

మందు.. విందు.. పొందు.. తగ్గేదే లే మ‌హిళా సెక్స్ వ‌ర్క‌ర్ల‌లో టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు

ఇటీవల మాంసం తినడం, మందు తాగడంలో ముందు నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో.. మరో రికార్డును కూడా దక్కించుకున్నది. ఇటీవల దేశంలో నిర్వహించిన ఓ సర్వేలో మహిళా సెక్స్ వర్కర్లు (ఎఫ్ఎస్ డబ్ల్యు) అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్లుగా వెల్లడైంది. దేశంలోప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ (పీఎంపీఎస్ఈ) సర్వే నివేదిక మేరకు మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15. 4 శాతంతో కర్ణాటక మొద‌టి స్థానంలోఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (12.0%), మహారాష్ట్ర (9.6%), ఢిల్లీ (8.9%), తెలంగాణ (7.6%) ఉన్నాయి. దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్యలో సుమారు 53% ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారని అధ్యయనం పేర్కొంది.
దేశంలో వ్యభిచార వృత్తిలో మ్రగ్గుతున్న మహిళలు పడే కష్టనష్టాలు వర్ణాతీతం. వ్యభిచారమే జీవనాధారంగా బతుకీడిస్తున్న మహిళల సంఖ్య తగ్గకపోగా..స్పా, మసాజ్ సెంటర్లు, పబ్ లు, బార్లు, ఫామ్ హౌజ్ లు, ఓయో రూమ్ కల్చర్ తో మరింత పెరిగిపోతుంది. స్థానిక మహిళలే కాకుండా విదేశాల నుంచి కూడా యువతులను రప్పించి రహస్య వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తుండటం తరుచు వెలుగుచూస్తున్నాయి. భారతదేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 651 జిల్లాల్లో పీఎంపీఎస్ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవి బాధితులున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. సుమారు 2.54 మిలియన్ల మంది హెచ్‌ఐవి తో జీవిస్తున్నారని అంచనా వేసింది. అయితే 2010 నుండి 2023 వరకు కొత్త హెచ్‌ఐవి సంక్రమణలలో దాదాపు 44% తగ్గుదల, ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 79% గణనీయమైన తగ్గుదల దేశంలో నమోదైనట్లుగా ఈ ఆధ్యయనం పేర్కొంది. ఎయిడ్స్ విస్తరణ తగ్గడానికి నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏసీపీ) కార్యక్రమాలు దోహదం చేశాయని తెలిపింది.

642జిల్లాల్లో మహిళా సెక్స్ వర్కర్ల ఉనికి
దేశంలోని 642 జిల్లాల్లో మహిళా సెక్స్ వర్కర్ల ఉనికిని పీఎంపీఎస్ఈ సంస్థ నివేదించింది. మొత్తం 9,95,499 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 3,51,020 మంది పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే పురుషులు (ఎంఎస్ఎం), 2,88,717 మంది ఇంజెక్ట్ చేసుకునే డ్రగ్స్ వాడేవారు, 96,193 మంది హిజ్రా/ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఉన్నట్లుగా పీఎంపీఎస్ఈ సంస్థ అధ్యయనంలో తేలింది. 43,579 వ్యభిచార ప్రాంతాలను, 10,718 వ్యభిచార ఎజెన్సీలు ఉన్నట్లుగా గుర్తించడంతో పాటు మొత్తం 16,095 గ్రామాలలో మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నట్లు నివేదించింది. 55.1శాతం మహిళా సెక్స్ వర్కర్లు ఇంటి ఆధారితంగా ఉన్నారని, 16.1శాతం రోడ్ల వెంట, 5.9శాతం వ్యభిచార కేంద్రాలు ఉన్నట్లుగా పేర్కొంది. ఎక్కువ వ్యభిచార ప్రాంతాలు 20శాతం వరకు కర్ణాటకలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలలో 8శాతం, మధ్యప్రదేశ్ లో 7శాతం, తమిళనాడులో 6శాతం, ఉన్నారని తేల్చింది. కాగా దేశంలో ఓ వ్యభిచార ప్రాంతంలో ఎక్కు మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 38మందితో, ఆంధ్రప్రదేశ 29మందితో టాప్ లో ఉన్నాయి. ఢిల్లీ, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ లలొ ఒక్కో వ్యభిచార ప్రాంతానికి సగటున 26 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా తేల్చింది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com