Friday, January 17, 2025

మందుబాబులకు షాక్… ధరల పెంపు

తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే మద్యం ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక కసరత్తులు మొదలు పెట్టింది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. మద్యం ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలిపింది. మద్యం ధరలను పెంచడంతో పాటు.. మద్యం విక్రయాలపై తమకు ఇచ్చే మార్జిన్‌ను కూడా పెంచాలని ఆ సంస్థ సర్కారుకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే మద్యం ధరలు పెంచాలని.. మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలిసారి జులై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్‌ చేయాలని సర్క్యులర్‌ ఇచ్చింది. ఆ తర్వాతి రోజే సీల్డ్‌ కవర్లు తెరిచి కంపెనీలు కోట్‌ చేసిన ధరలను కమిటీ పరిశీలించింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్‌, వైన్‌, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్‌ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్‌ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్‌ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com