Saturday, June 14, 2025

మంగ్లీ మంచిదనే పార్టీకి వెళ్ళాను-నటిదివి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు సంచలనంగా మారాయి. ఈ పార్టీలో నటి దివి వద్త్య కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి. దీంతో ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై దివి క్లారిటీ ఇచ్చారు. మంగ్లీ తన స్నేహితురాలు అని అమె మంచిదని, అందుకే ఆమె బర్త్ డే వేడుకలకు వెళ్లానని దివి తెలిపింది. కేవలం వ్యక్తిగత సంబంధం ఆధారంగానే తాను ఆ వేడుకకు వెళ్లానని, దానిపై అనవసర వివాదాలు సృష్టించవద్దని ఆమె పరోక్షంగా సూచించారు. సోషల్ మీడియాలో తన ఫొటోలను ఉపయోగించి తప్పులను తనపై మోపడం సరికాదని దివి గట్టిగా చెప్పారు. అక్కడ జరిగిన తప్పులన్నింటినీ నాపైన మోపడం సరికాదని ఆమె అన్నారు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే, అందుకు మీ దగ్గర తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే సోషల్ మీడియాలో నా ఫొటో పెట్టండి. కానీ ఎలాంటి ఆధారం లేకుండా నా ఫొటో వాడి నన్ను నెగెటివ్ చేయకండి. దీని వల్ల నా కెరీర్‌కు చాలా ఇబ్బంది అవుతుందని దివి ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే ఈ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకుంటున్నట్టు సమాచారం రావడంతో చేవెళ్ల పోలీసులు త్రిపుర రిసార్ట్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అంతేకాకుండా, పార్టీలో ఉన్న 48 మందికి పోలీసులు గంజాయి పరీక్షలు నిర్వహించగా, అందులో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com