Wednesday, November 20, 2024

చిత్రపురి కాలనీ భూమి అమ్మకాల్లో అవకతవకలు

21మంది ప్రముఖులపై కేసులు

మణికొండ చిత్రపురి కాలనీ భూముల గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుత చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌లో 15 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రస్తుత, పాత కమిటీలో కీలక పాత్ర పోషించిన 21మందిపై సెక్షన్ 120B కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా ఎఫెక్ట్‌తో మణికొండ చిత్రపురి కాలనీ భూముల గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. ఈ కాలనీ నిర్మాణం, ఫ్లాట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అధికారులు.. ఈ అక్రమ వ్యాపారం విలువ వందల కోట్లలో ఉన్నట్లు తేలడంతో ఈ కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (EOW)కి బదిలీ చేశారు. దీంతో ప్రస్తుత చిత్రపురి కమిటీపై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌లో 15 కేసులు నమోదయ్యాయి.

21మందిపై నాన్ బెయిలబుల్ కేసులు..
ఈ మేరకు గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కస్తూరి ఆనంద్ ఫిర్యాదుతో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత, పాత కమిటీలో మెంబర్లుగా ఉండి కీలక పాత్ర పోషించిన 21మందిపై సెక్షన్ 120B కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కాలనీ ఫ్లాట్లను లబ్దిదారులకి కాకుండా బయటవారికి కమిటీ అమ్ముకుందని పలువురు ఆరోపించారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు ఫ్లాట్ల అమ్మినట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కమిటీపై ఒకేసారి 15 FIRలు నమోదు చేయగా.. చిత్రపురి కాలనీ కమిటీ సభ్యుల్లో వల్లభనేని అనిల్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, యాంకర్ దీప్తి వాజపేయి, వినోద్ బాల, కాదంబరి కిరణ్ ఉన్నారు. ఆలహరి వివి ప్రసాద్, కొంగర రామకృష్ణ, వినోద్ బాల, ప్రవీణ్ యాదవ్, సత్యనారాయణ దోరా, దీప్తి వాజపేయి, టీ.లలిత, , దేవినేని బ్రహ్మానందరావు, కొల్లి రామకృష్ణ, కె.ఉదయ భాస్కరరావు, అనిత నిమ్మగడ్డ, రఘు బత్తుల, మహేంద్ర రెడ్డి, జెల్లా మధుసూదన్, పీఎస్ కృష్ణ మోహన్ రెడ్డి, కె.రాజేశ్వరరెడ్డి, చంద్రమధు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular