మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా వచ్చిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇండస్ట్రీలో మెల్లగా బిజీగా అవుతుంది. నిహారిక ఇప్పటికే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది కమిటీ కుర్రోళ్ళు మూవీతో మంచి హిట్ అందుకుంది మెగా డాటర్. ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ మూవీ.. రూ.20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కామెడీ డ్రామా జోనర్ లో వచ్చిన ఆ మూవీ ఇరవై కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. నిర్మాతగా నిహారికకు మంచి లాభాలు వచ్చాయని చెప్పాలి. కమిటీ కుర్రోళ్లు తర్వాత తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై కొన్ని సినిమాలు, వెబ్‌సిరీసులు నిర్మిస్తోంది నిహారిక. అదే సమయంలో రెండు సినిమాల్లో తానె నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్.. కోలీవుడ్ లో చెరో సినిమాలో యాక్ట్ చేస్తోంది. తెలుగులో వాట్ ది ఫిష్ మూవీలో నటిస్తున్న నిహారిక ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో తమిళ మూవీ మద్రాస్ కారణ్ లో నటిస్తుండగా.. మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా కనిపించనున్నారు. రొమాంటిక్ యాక్షన్ జోనర్ లో వస్తున్న ఆ మూవీని వాలి మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా నిహారిక ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన వీడియో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో మణిరత్నం సినిమాలో ఎప్పటికీ జీవించడం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ సమయంలో పర్‌పుల్ శారీ వేసుకున్న నిహారిక.. ఓపెన్ హెయిర్ తో కనిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ఉండగా.. వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియోలో కాఫీ తాగుతూ.. తన ఎక్స్‌ప్రెషన్స్ తో అందరినీ మెప్పించింది నిహారిక. దీంతో నెటిజన్లు ఫుల్ గా స్పందిస్తున్నారు. మణిరత్నం హీరోయిన్ లా మారిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. పెర్ఫెక్ట్ గా సెట్ అయిందని అంటున్నారు. వాస్తవానికి.. నిహారికకు దర్శకుల్లో మణిరత్నం అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆమె లుక్స్, చూపు, నవ్వు చూస్తుంటే మణిరత్నం హీరోయిన్ గానే అనిపిస్తోందని అంటున్నారు.