Sunday, April 6, 2025

మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు,

ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ చాలా బాగుందన్న నాగ్ అశ్విన్…మూవీ టీమ్ కు తన బెస్ట్ విషెస్ అందించారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ బీట్ కంపోజ్ చేయగా..వనమాలి లిరిక్స్ రాశారు. షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ ఇంటెన్స్ గా పాడారు. ‘భగ భగ..’ సాంగ్ ఎలా ఉందో చూస్తే – ‘మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటి దగా, మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com