Monday, March 10, 2025

సుదీర్ఘ విరామం తర్వాత మన్మథుడు జోడి నాగార్జున, అన్షు

కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీగా నిలిచిపోయింది మన్మథుడు. విజయ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ కథ మాటలు అందించిన ఈ కూల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి వచ్చి 22 ఏళ్లవుతోంది. మన్మథుడు సినిమాలో అభిగా నాగార్జున, మహి క్యారెక్టర్ లో అన్షు జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అన్షు పెళ్లయ్యాక కుటుంబంతో లండన్ లో స్థిరపడింది.

ఇటీవల ఆమె ఇండియాకు వచ్చింది. హైదరాబాద్‌లోని తన స్నేహితులను మీట్ అవుతోంది. ఈ సందర్భంగా అన్షు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి నాగార్జున, అమల హాజరయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పార్టీలో మన్మథుడు జంట నాగార్జున, అన్షు మీట్ అయ్యారు. తాము కలిసి నటించిన మెమొరీస్ షేర్ చేసుకున్నారు. నాగార్జున, అన్షు మీట్ అయిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభి, మహి బెస్ట్ పెయిర్ అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com