Sunday, December 29, 2024

ఇక సెల‌వు.. మాజీ ప్ర‌ధాని మన్మోహన్‌ సింగ్‌కు క‌న్నీటి వీడ్కోలు

మాజీ ప్ర‌ధాని మన్మోహన్‌ సింగ్‌కు క‌న్నీటి వీడ్కోలు
నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
నివాళుల‌ర్పించిన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్‌
ప్రధాని మోదీ, మంత్రులు, స్పీకర్‌ తదితరులు
కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి ఘాట్‌ వరకు అంతిమ యాత్ర
పాడె మోసిన‌ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌ గాంధీ

ఇక సెలవు అంటూ ఆర్థికవేత్త మన్మోహన్‌ నింగికేగారు. దివంగత మాజీ ప్రధానికి క‌న్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పాడె మోశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా త‌దిత‌రులు హాజరై మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్‌కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బిఆర్ఎస్  రాష్ట్ర‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరయ్యారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.
image.png
ఏఐఐసీ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ఘ‌న‌ నివాళి
కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం శనివారం ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్‌ పార్థివదేహాన్ని తీసుకువొచ్చారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, సోనియా, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి తదితరులు నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ సమయంలో రాహుల్‌.. మన్మోహన్‌ కుటుంబం వెన్నంటే ఉన్నారు. 92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు.
image.png
దీంతో కుటుంబసభ్యులు హాస్పిట‌ల్‌లో చేర్పించ‌గా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు మన్మోహన్‌ సింగ్‌ మృతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని సతీమణి గురుశరణ్‌ సింగ్‌, కుటుంబసభ్యులకు బైడెన్‌ దంపతులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈమేరకు వైట్‌హౌస్ ఒక‌ ప్రకటన విడుదల చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com