Friday, September 20, 2024

గంజాయి, నాటుసారా, కల్తీకల్లు కేసుల్లో పలు జిల్లాలు ముందంజ

  • గంజాయి, నాటుసారా, కల్తీకల్లు కేసుల్లో పలు జిల్లాలు ముందంజ
  • గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధికంగా కేసుల నమోదు
  • ఈ సంవత్సరం మే నుంచి ఆగష్టు 19వ తేదీ వరకు
  • నాలుగు నెలల్లో మూడింతలు పెరిగిన కేసులు
  • కల్తీ కల్లు కేసులు ఆ నాలుగు జిల్లాలోనే అధికం

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గంజాయి, నాటుసారా కేసులు మూడింతలు పెరగ్గా కల్తీకల్లుకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ భారీగా కేసులు నమోదు చేయడం విశేషం. గంజాయితో పాటు నాటుసారాకు సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్‌లో 867 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం మే నుంచి ఆగష్టు 19వ తేదీ వరకు (నాలుగు నెలల్లోనే) 5,296 కేసులు నమోదయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మే నుంచి ఆగష్టు 19వ తేదీ వరకు సుమారుగా 4,322 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేయడం విశేషం. ఈ కేసుల్లో భాగంగా గత సంవత్సరం ఐడి 4,550 లీటర్‌లను స్వాధీనం చేసుకోగా, ఈ సంవత్సరం 29,518 లీటర్ల ఐడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు బిజే 35,411 (కిలోలు) గత సంవత్సరం స్వాధీనం చేసుకోగా, ఈ సంవత్సరం మే నుంచి ఆగష్టు వరకు సుమారుగా 1,26,704 కిలోలను, గత సంవత్సరం అలం 2,631 కిలోలు, ఈసారి 16,791 కిలోలు, గత సంవత్సరం ఎఫ్‌జే వాష్ (బెల్లం పానకాన్ని) 55,850 లీటర్‌లు, ఈసారి (మే నుంచి ఆగష్టు వరకు) 5,26,695 లీటర్‌లను, గత సంవత్సరం 136 వాహనాలు, ఈసారి (మే నుంచి ఆగష్టు వరకు) 738 వాహనాలను ఆయా కేసుల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం విశేషం. దీంతోపాటు జరిమానా రూపంలో సుమారుగా రూ.47,05,116లను ఆ శాఖ వసూలు చేయగా, 4,327 మందిని బైండోవర్ చేసింది.

భూపాలపల్లి జిల్లా 792 కేసులతో ప్రథమస్థానం

ఇక ఈ సంవత్సరం మే నుంచి ఈ ఆగష్టు 19వ తేదీ వరకు (నాలుగు నెలలకు) సంబంధించి భూపాలపల్లి జిల్లా 792 కేసులతో ప్రథమ స్థానం దక్కించుకోగా, మహబూబాబాద్ 620 కేసులతో రెండోస్థానం, వరంగల్ రూరల్ 473 కేసులతో మూడోస్థానం, కొత్తగూడెం 274 కేసులతో నాలుగోస్థానం, మంచిర్యాల 267 కేసులతో ఐదోస్థానం, ఆరోస్థానంలో నల్లగొండ, సూర్యాపేటలు 261 కేసులతో ఈ స్థానానుల దక్కించుకున్నాయి. ఇక అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాలను చూసుకుంటే హైదరాబాద్‌లో (0) కేసులు, మల్కాజిగిరిలో ఒక కేసు, మెదక్‌లో (–మైనస్ 2) కేసులు, మేడ్చల్‌లో (2) కేసులు, శంషాబాద్‌లో (2 కేసులు), సికింద్రాబాద్‌లో (2) కేసులు, గద్వాల్‌లో (8 కేసులు), యాదాద్రిలో (31) కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో (267 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. నిర్మల్‌లో 165 కేసులు నమోదు కాగా (133) మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో218 కేసులు నమోదు కాగా, (168 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాలో 177 కేసులు నమోదు కాగా, (104 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 230 కేసులు నమోదు కాగా, (131 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 64 కేసులు నమోదు కాగా, (62 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వనపర్తి జిల్లాలో 101 కేసులు నమోదు కాగా, (114 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలో 224 కేసులు…206 మంది అరెస్టు 

నాగర్‌కర్నూల్ జిల్లాలో 224 కేసులు నమోదు కాగా, (206 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లాలో 43 కేసులు నమోదు కాగా, (44 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 121 కేసులు నమోదు కాగా, (111 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వరంగల్ అర్భన్ జిల్లాలో 46 కేసులు నమోదు కాగా, (59 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. జనగాం జిల్లాలో 120 కేసులు నమోదు కాగా, (98 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లాలో 97 కేసులు నమోదు కాగా, (62 మంది వ్యక్తులు, సంగారెడ్డి జిల్లాలో 18 కేసులు నమోదు కాగా, 11 మంది వ్యక్తులు, నిజామాబాద్ జిల్లాలో 129 కేసులు నమోదు కాగా, (106 మంది వ్యక్తులు, కామారెడ్డి జిల్లాలో 134 కేసులు నమోదు కాగా, (50 మంది వ్యక్తులు, ఖమ్మం జిల్లాలో 137 కేసులు నమోదు కాగా, (110 మంది వ్యక్తులు, సరూర్‌నగర్‌లో 164 కేసులు నమోదు కాగా, (89 మంది వ్యక్తులు, వికారాబాద్ జిల్లాలో 74 కేసులు నమోదు కాగా, (57 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు.

2024లో 2,646 కల్తీ కల్లుషాపుల మూసివేత

కల్తీకల్లుకు సంబంధించి ఈ సంవత్సరంలో (జూన్ 18వ తేదీ వరకు) సుమారుగా 12,61,245 లీటర్ల కల్తీకల్లును ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 19,075 లీటర్ల కల్తీకల్లును, 2023లో 15,50,658 లీటర్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం విశేషం. దీంతోపాటు క్లోరోఫాంలను ఎక్సైజ్ అధికారులు భారీగా స్వాధీనం చేసుకోవడం విశేషం. 2022లో క్లోరోఫాం 1,832 కిలోలను స్వాధీనం చేసుకోగా, 2023లో 53 కిలోలు, 2024లో 706 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్ఫాజోలంకు సంబంధించి 2022 సంవత్సరంలో 3.3 కిలోలు, 2023లో 38 కిలోలు, 2024లో 2.9 కిలోలు (జూన్ 17వ తేదీ నాటికి) ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీకల్లుకు సంబంధించి మహబూబ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అధికంగా కేసులు నమోదు కావడం విశేషం. వీటితో పాటు అనుమతులు లేని కల్తీకల్లు షాపులను సైతం ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. 2022లో 326 షాపులను, 2023లో 4,823 షాపులు, 2024లో 2,646 కల్తీ కల్లు షాపులను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos