Monday, January 27, 2025

క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

  • లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ..
  • మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు..
  • తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత

ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారని వారిలో మావోయిస్టు అగ్రనేత దామోదర్‌ అలియాస్‌ ‌బడే చొక్కారావు మృతి చెందినట్లు వొచ్చిన వార్తలను మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత తీవ్రంగా ఖండించారు. ఇందుకు సంబంధించిన లేఖను శనివారం విడుదల చేశారు.

దామోదర్‌ అలియాస్‌ ‌బడే చొక్కారావు మృతి చెందినట్లుగా పోలీసులే కట్టుకథ అల్లారని మావోయిస్టు పేరుతో ప్రెస్‌నోట్‌లు జారీ చేశారని లేఖలో పేర్కొన్నారు. దామోదర్‌ అలియాస్‌ ‌బడె చొక్కారావు చనిపోలేదని ఆయన బతికే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది చనిపోయారని వారిలో నలుగురు మాత్రమే మావోయిస్టులు ఉన్నారని మిగతా నలుగురు గ్రామస్తులు ఉన్నట్లుగా లేఖ ద్వారా వివరించారు. ప్రజల్లో బూటకపు ప్రకటనలు చేస్తూ అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

దామోదర్‌ అలియాస్‌ ‌బడే చొక్కారావుతో పాటు తమ సహచరులందరు క్షేమంగానే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ ‌ఖగార్‌ ‌పేరుతో మావోయిస్టు పార్టీని అంతమొందించాలని యత్నిస్తోందని తెలిపారు. ఆపరేషన్‌ ‌పేరిట సాధారణ ప్రజలను కూడా పోలీసులు చంపుతున్నారని, వారి పేరిట కోట్ల డబ్బులు వారి జేబుల్లో వేస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మావోయిస్టుల కోసం మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం ప్రజలకు అతిపెద్ద ముప్పుగా మారిందని అందువల్ల  ప్రజా ఆస్తి , పర్యావరణం కాపాడానికి ప్రజలందరూ ఐక్యంగా రక్షించడం అందరి బాధ్యత అని లేఖలో పిలుపునిచ్చారు.

ఈనెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 వేల మంది పోలీస్‌ ‌బలగాలను బీజాపూర్‌ ‌జిల్లాలోని సింగవరం, తుండెపల్లి, మల్లంపేట, కూజారి కాంకేర్‌ ‌గ్రామాల ప్రజలపై జరిగిన పిరికిపంద దాడులను తిప్పికొడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై  స్వతంత్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు వైద్యం చేసేందుకు వెళ్లిన సహచరులను నిరాయుధులుగా పట్టుకొని ప్రజల ముందు చిత్రహింసలకు గురిచేసి దారుణ హత్య చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ హత్యలపై విచారణ జరిపించాలని లేఖ ద్వారా డిమాండ్‌ ‌చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com