- ఇన్‌ఫార్మర్ నెపంతో మహిళను హత్య చేసిన మావోలు
- ఇద్దరు జవాన్‌లకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు
- ప్రతిఘటించిన పోలీసులు..సమీప అడవుల్లోకి పారిపోయిన మావోయిస్టులు
- ఇది కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచనగా పోలీసుల అనుమానాలు
సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి అలజడి రేపింది. పోలీసుల బేస్‌క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు జవాన్‌లకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప హాస్పిటల్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జీడిపల్లి రెండవ పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా రాకెట్ లాంచర్‌లతో దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన పోలీస్ బలగాలు ఒక్కసారిగా ప్రతిఘటించాయి. ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా వ్యూహరచన చేసినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
24 గంటలు గడవకముందే మావోయిస్టులు పోలీసు క్యాంపులపై దాడికి దిగారు. శుక్రవారం జీడిపల్లి సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడికి దిగారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున మరోసారి జీడిపల్లి రెండవ బేస్‌క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. మావోయిస్టులు బేస్ క్యాంపుపై దాడి జరిగిన సమయంలో ఒక పోలీసు ఉన్నతాధికారి ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా మావోయిస్టులు తీవ్ర నష్టపోతున్నారు. 2024 జనవరి నుంచి నవంబర్ నాటి వరకు మావోయిస్టు నాయకులు ఎన్‌కౌంటర్‌లో చనిపోతున్నారు. పోలీసులుపై ప్రతికారం తీర్చుకునేందుకు కేంద్ర కమిటీ అగ్రనాయకులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల సమయంలోనే పోలీసులు బేస్ క్యాంపులపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికే మావోయిస్టులు ప్రతీకారచర్యకు దిగుతున్నట్లు సమాచారం. మావోయిస్టులను ఏరివేసేందుకు అటవీ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం భారీగా క్యాంపులు ఏర్పాటు చేసింది. దీని కారణంగానే ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. మావోయిస్టు పార్టీ కూడ చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇన్‌ఫార్మర్ నెపంతో మహిళ హత్య
ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు మహిళను హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ కు చెందిన గ్రామస్తురాలు సుక్రా(40) అనే మహిళలను ఆమె భర్తను శనివారం అర్ధరాత్రి మావోయిస్టులు తీసుకువెళ్ళారు. ఆ తరువాత ఆ మహిళను గొంతుకోసి హత్య చేశారు. ఈ సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. పోలీసుల ఇన్‌ఫార్మర్‌గా ఆ మహిళ ఉన్నందువల్లే హత్య చేసినట్లు మావోయిస్టులు ధ్రువీకరించారు. కొన్ని రోజులుగా ఓ అంగన్వాడీ కార్యకర్తను మాజీ సర్పంచ్‌లను హత్య చేసిన మావోయిస్టులు శనివారం రాత్రి మరో మహిళను హత్య చేయడం కలకలం రేపింది.