Wednesday, January 8, 2025

ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ మందుపాతర పేల్చిన మావోయిస్టులు

  • తునాతునక‌లైన‌ జవాన్‌ల వాహనం
  • ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృతి
  • మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. బీజాపూర్‌ హాస్పిటల్‌కు  తరలింపు

తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవాన్‌ల వాహనాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఇడి మందుపాతర పేలి ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళతే.. ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా , సుక్మా జిల్లా సరిహద్దున ఉన్న కుత్రు అటవీ ప్రాంతంలో బేద్రే, కుత్రు ప్రాంతంలో ఉన్న రోడ్డులో కూంబింగ్‌ ‌నిర్వహించి తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు జవాన్‌లు లక్ష్యంగా అమర్చిన మందు పాతరను ఒక్కసారిగా పేల్చడంతో జవాన్‌లు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా పైకి ఎగిరి తునాతునకలు అయింది.

ఈ సంఘటనలో ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్‌లు అక్కడిక‌క్కడే మృతి చెందారు. మృతి చెందిన డిఆర్‌జి జవాన్‌లను గుర్తు పట్టలేనంతగా శరీర భాగాలు చెల్లచెదురయ్యాయి. మరో ఆరుగురు జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని బీజాపూర్ హాస్పిట‌ల్ కు తరలించినట్లు తెలుస్తోంది. జరిగిన సంఘటనను బస్తర్‌ ఐజి సుందర్‌రాజన్ ధ్రువీకరించారు. వాహనంలో 15 మంది జవాన్‌లు ఉన్నారు.   దంతెవాడ, నారాయణపూర్‌, ‌బీజాపూర్‌ ‌జిల్లాల నుంచి డిఆర్‌జి బృందాలు ఈ ఆపరేషన్‌ ‌నిర్వహించారు. 15 మంది వాహనంలో తిరిగి వొస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మందు పాతర పేలిన ప్రాంతం అంతా పెద్ద లోయగా ఏర్పడింది. శక్తివంతమైన మందు పాతర కావడంతో వాహనం ముక్క‌లైపోయింది.

ఇటీవల కాలంలో భద్రత బలగాల దాడులకు మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. దీని కోసం ప్రతీకార చర్య చేసేందుకు మావోయిస్టులు ఇప్పటివరకు ఎదురు చూసారు. జవాన్‌లు అటుగా వెళ్తున్న వాహనాన్ని ఒక్కసారిగా పసిగట్టి పేల్చివేశారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ ‌లో ఐదుగురు మావోయిస్టులను మావోయిస్టు పార్టీ నష్టపోయింది. అదును కోసం చూస్తున్న మావోయిస్టులు ప్రతీకార చర్యకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాలంలో భద్రత బలగాలు అనేక మందు పాతరలను కనుగొని నిర్వీర్యం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిర్వీర్యం చేసే క్రమంలో ఇటీవల కాలంలో ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇప్పటికే అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది జల్లెడ పడుతున్నారు. మావోయస్టులను ఏరివేసేందుకు భారీగా ప‌థ‌కాలు ర‌చిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో మావోయిస్టులు భారీగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టులు కూడా భద్రతబలగాలపై కక్ష సాధించుకునేందుకు అనేక యత్నాలు చేసినప్పటికి విఫలమవుతూ వొచ్చారు. అనేక మందుపాతరలను భద్రత బలగాలు వెలికి తీశాయి సోమవారం నాడు జరిగిన ఘ‌టనలో మాత్రం జవాన్‌లు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదుగురు జవాన్‌లను గుర్తించినట్లు తెలుస్తుంది. శరీర భాగాలు చెల్లచెదురు కావడం వలన గుర్తించడం ఇబ్బంది మారిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com