దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. మార్చ్ 21న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘చిన్న చిత్రాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన తమ్మారెడ్డికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పటివరకు ఆ క్రమశిక్షణతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలానే చేస్తూ ఉంటాను. ఓ అందాల రాక్షసి సినిమా థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా. ఒకసారి మా సినిమా థియేటర్ లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియన్స్ కి తెలుస్తుంది. టీమ్ అంతా కలిసి ఒక ఫ్యామిలీలా ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా చిత్రం మార్చి 21న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.