Tuesday, March 11, 2025

గొర్రె చిక్కింది.. ప్లాన్‌ సక్సెస్‌.. కాంగ్రెస్‌లోకి మేడ్చ‌ల్ మ‌ర్రి?

టీఎస్ న్యూస్: బీఆర్‌ఎస్‌కి బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే చేరుతున్నాడు. మల్కాజిగిరిఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఆయన సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన గురువారం నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాజశేఖర్‌రెడ్డికి చెందిన కాలేజీలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్‌ అధికారులు తొలగిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఆస్థులను కాపాడుకోవాలనే కోణంలో కాంగ్రెస్‌లోకి చేరితే సేఫ్‌ జోన్‌ అని ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.

మల్కాజిగిరి పరిధిలోని దుండిగల్ లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఏరోనాటికల్ ఇంక్లీవ్, ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. ఎమ్మెల్యేకు సంబంధించిన కాలేజీలోని అక్రమ నిర్మాణాలను అధికారులు జెసిబి సహాయంతో కూల్చివేశారు. ఎం.ఎల్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు గతంలోనే గుర్తించారు. చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని గతంలో ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు. అయితే గతంలో రేవంత్‌రెడ్డి ఈ కబ్జాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడంతో వాటిని కూల్చివేసే పనిలో పడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌లో కొనసాగితే ఆస్తులను కాపాడుకోవడం కష్టమనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీలో ఉంటే నాయకులు తమ ఆస్తులను సేఫ్‌ జోన్‌లో ఉంచుకోవచ్చు అనే అంశం కూడా ఈ విషయం ద్వారా తేటతెల్లమవుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com