Saturday, February 15, 2025

వివాహబంధంపై హైకోర్టు సంచలన తీర్పు

మధ్య ప్రదేశ్‌ హైకోర్టు వివాహ బంధంపై సంచలన తీర్పుని ఇచ్చింది. భర్త కాకుండా మరో వ్యక్తి పట్ల భార్య ప్రేమ, అనురాగం ప్రదర్శించడం నేరం కాదని చెప్పింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేనంత వరకు దానిని వ్యభిచారంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, కాబట్టి ఆమె మనోవర్తికి అనర్హురాలన్న భర్త వాదనను జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా కొట్టిపడేశారు.

ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు రుజువైతే తప్ప మనోవర్తి, పోషణ భత్యం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. విడిగా ఉంటున్న భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ. 4 వేలు చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

‘‘ఎటువంటి శారీరక సంబంధం లేకుండా భార్య వేరొకరిపట్ల ప్రేమ, ఆప్యాయత కనబరుస్తుంటే, ఆమె వ్యభిచారం చేస్తున్నట్టు నిర్ధారించలేం’’ అని కోర్టు స్పష్టం చేసింది. భర్తకు అతి తక్కువ ఆదాయం వస్తుందన్న కారణంతో భరణాన్ని తిరస్కరించడం సరికాదని పేర్కొంది. తన రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోలేనని తెలిసీ వివాహం చేసుకున్నట్టయితే అందుకు అతడే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com