Tuesday, April 1, 2025

మాస్‌ లుక్‌లో మెగా హీరో

– రామ్‌చరణ్‌ బర్త్‌డే ట్రీట్‌
– ఆర్‌సీ16 టైటిల్‌ ఫిక్స్‌
– పెద్దిగా రామ్‌చరణ్‌

రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌సీ 16 టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ముక్కుకు పోగు, పొడవైన గడ్డంతో బీడీ వెలిగిస్తూ మాస్‌ యాంగిల్‌లో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రామ్‌చరణ్‌ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియా అంతటా వైరల్‌ అయింది.రామ్‌చరణ్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌ మేకోవర్‌లో కనిపిస్తున్నారు. కంప్లీట్‌ రా అండ్‌ రస్టిక్‌గా రామ్‌చరణ్‌ కనిపించడం ఫ్యాన్స్‌కి ఫుల్‌ జోష్‌ని ఇచ్చింది.

మరో పోస్టర్‌లో క్రికెట్‌ బ్యాట్‌తో సీరియస్‌ లుక్‌లో గత సినిమాలకు భిన్నంగా రామ్‌చరణ్‌ దర్శనమిచ్చాడు. పోస్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో జాతర సెట్‌, విలేజ్‌ నేటివిటీ కనిపిస్తోంది. రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది మూవీకి ఉప్పెన ఫేమ్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ అగ్రనటుడు శివరాజ్‌కుమార్‌తో పాటు దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపిచబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com