వింటేజ్ వైజాగ్‌లోని ఎసెన్స్ ని ప్రతిబింబించేలా వింటేజ్ మ్యాసీవ్ సెట్‌లలో షూటింగ్ జరిగింది. చాలా కీలకమైన సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగింది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ నోరా ఫతేహీను రెట్రో అవతార్‌లో, కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో ఎలిగెంట్ పోజులో ప్రజెంట్ చేస్తోంది.
నోరా అద్భుతమైన డ్యాన్సర్, మట్కాలోని రెట్రో సాంగ్స్ ఆమెలోని అల్టిమేట్ డ్యాన్స్ ని చూపుతాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అదిరిపోయే సెట్ లో నెంబర్ అఫ్ డ్యాన్సర్ తో చాలా గ్రాండ్ గా షూట్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ఈ మూవీలో చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో ‘మట్కా’ ఒక మైల్ స్టోన్ మూవీ కాబోతోంది.