ఓ మంత్రిపై వ్యతిరేకతతో అంతర్గతంగా తిరుగుబాటు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. వారితో సీఎం రేవంత్ సహా.. ఏఐసీసీ నేతలు సమావేశమవ్వాలని ఏఐసీసీ సూచించడంతో.. గురువారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డితోపాటు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించారు. ఈ సమావేశానికి వచ్చే ఎమ్మెల్యేలను 4 వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు. అసలు సమస్య ఏమిటి..?, మంత్రితో వచ్చిన ఇబ్బందులపై చర్చించనున్నారు.
ఆగండి… డిస్కస్ చేద్దాం
తెలంగాణ అధికార పార్టీలో బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల వర్గరాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ గణాంకాలు శరవేగంగా మారుతున్నాయి. గతకొన్ని రోజులు క్రితం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్‌గా సమావేశమైన విషయం తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ పార్టీ విధివిధానాలకు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మర్రి చెన్నారెడ్డి హూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో గురువారం ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం పార్టీ ఎమ్మెల్యేలను నాలుగు వర్గాలుగా విభజించి వారితో మాట్లాడనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలు పరిష్కరించనున్నారు. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఇంట్లో బుధవారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. గతంలోనే ముగ్గురిని అన్హరులుగా ప్రకటించాలని వేసిన పిటిషన్, తాజాగా మరో ఏడుగురిపై కూడా పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 14న సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారు వేం రెడ్డి నరేందర్ రెడ్డితోపాటు చర్చలు జరిపారు.