అక్కినేని నాగ చైతన్య, దేవ కట్టా కాంబినేషన్‌లో ‘మయసభ’ అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కనుందని, అందులో చైతన్య నటించనున్నారని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, సదరు ప్రాజెక్టుతో నాగ చైతన్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన టీమ్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం నాగ చైతన్య తన పూర్తి దృష్టిని ‘NC24’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంపైనే దృష్టి పెట్టారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అభిమానులు, మీడియా మిత్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ‘NC24’ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ‘విరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్న దండు, ఈ చిత్రాన్ని ఒక భారీ మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.