నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు నగరంలో పెద్ద ఎత్తున సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం శేరిలింగంపల్లి జోన్ లోని పలు జంక్షన్ల లో సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తో కలిసి గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అందులో భాగంగా సీఎస్‌ఆర్ పద్దతిన రాగా ఫౌండేషన్ నిర్మించిన జంతు శ్మశాన వాటికను మేయర్ ప్రారంభిం చారు. అనంతరం జెఆర్‌సి జంక్షన్ బ్యూటిఫికేషన్ శిల్పాలు, ఫౌంటైన్‌లు, క్యాస్కేడ్‌లు వంటి సౌందర్య పరిపూర్ణ పనులు ప్రారంభించారు.
బయోడైవర్సిటీ జంక్షన్ అభివృద్ధి, శిల్పాలు, ఫౌంటైన్‌లు, క్యాస్కేడ్‌లు, లైటింగ్ పనుల అప్‌స్కేలింగ్ ప్రారంభించడం జరిగింది. రోడా మిస్త్రీ కాలేజ్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీధి ఫర్నిచర్ వీధి అలంకరణ పనులు ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో రోటరీల అభివృద్ధి శిల్పాలు, ఫౌంటైన్‌లతో కూడిన రోటరీల సౌందర్య పనులు ప్రారంభించారు. ఖాజాగూడ జంక్షన్ బ్యూటిఫికేషన్ లో శిల్పాలు, ఫౌంటైన్‌లు, లైటింగ్ పనుల స్కేలింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్.ఈ. శంకర్ నాయక్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.