Monday, April 21, 2025

మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇటీవల మృతిచెందిన 34 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కోక్కరికి లక్ష రూపాయల ఆర్థికసాయం మీడియా అకాడమీ అందిస్తుందని అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల వ్యవధిలోనే 34 మంది జర్నలిస్టులు చనిపోయారని ఆయన అన్నారు. వీరి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయంతో పాటు చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు నెలకు 3,000 రూపాయలు పెన్షన్ కింద అకాడమీ ఇస్తుందని, ఇలా ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని ఆయన అన్నారు. పెన్షన్‌తో పాటు వారి పిల్లలకు ఎల్‌కెజీ నుంచి పదవ తరగతి వరకు చదువుకోవడానికి నెలకు 1,000 రూపాయల అందజేస్తామని ఆయన తెలిపారు.

ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతూ ప్రమాదానికి గురైన జర్నలిస్టులకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మరికొన్ని దరఖాస్తులను కమిటీ ఓకే చేసిందని, అందులో క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ గురు ప్రసాద్ ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న బండి నారాయణకు ఒక్కోక్కరికి లక్ష రూపాయలను మంజూరు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. వీరితోపాటు మరో ఇద్దరు జర్నలిస్టులకు 50 వేల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, మేనేజర్ పిసి వెంకటేశం, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచంద్రరావులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com