భూపాలపల్లి జిల్లా:
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ను దారు ణంగా నరికి చంపేశారు. ఈయనపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదు అయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. రాజలింగ మూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నిక ల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా గెలుపొందారు.
కొద్ది నెలల తర్వాత సరళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు.బాధితుడి కుటుంబ సభ్యులు తెలి పిన వివరాల ప్రకారం.. బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తున్న సమయంలో….
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో నలుగురు వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారి గా కత్తులు, గొడ్డళ్లతో నరికారు. తలకు బలమైన గాయంతోపాటు, కడుపులో కత్తిపోట్ల కారణంగా పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.