Monday, May 5, 2025

ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి మ్యాజిక్

టాలీవుడ్‌లో హీరోయిన్ల పరిధి చాలా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. వస్తే ఒకేసారి కోకొల్లలుగా అవకాశాలు వస్తాయి. లేదంటే ఎంత గ్లామర్‌, ట్యాలెంట్‌ ఉన్నప్పటికీ ఒక్క సినిమాతోనే కెరియర్‌ అంతం అయిపోతుంటుంది. ఇకపోతే టాలీవుడ్ లో నెక్స్‌ట్‌ టాప్ ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ ఎవరికి అంటే ఎక్కువ శాతం ఆడియన్స్ ఎంపిక చేసుకునే పేరు మీనాక్షి చౌదరి. సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి సినిమా నుంచి వస్తున్న ప్రతి ఆఫర్ ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఖిలాడి, హిట్ 2 ఇలా ఓ పక్క యువ హీరోల సరసన చేస్తూనే మహేష్ లాంటి స్టార్ సినిమాలో చిన్న పాత్రను సైతం ఎలాంటి డౌట్లు లేకుండా చేసింది.

తెలుగులో అమ్మడి కెరీర్ ఇలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం స్టార్స్ తో జత కట్టేస్తుంది. దళపతి విజయ్ గోట్ లో అమ్మడు ఫిమేల్ లీడ్ గా నటించింది. ప్రస్తుతం తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్, అనీల్ రావిపుడి కాంబో సినిమాతో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తుంది. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాలో కూడా మీనాక్షి నటించింది. ఐతే ఓ పక్క సినిమాలతో అదరగొట్టేస్తున్న అమ్మడు ఆఫ్ స్క్రీన్ ఫోటో షూట్స్ తో కూడా వారెవా అనిపిస్తుంది. మీనాక్షి షేర్ చేస్తున్న ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. తన న్యాచురల్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెట్టేస్తుంది అమ్మడు. తెర మీద అందంగా కనిపించిన ప్రతి ఒక్కరు ఆఫ్ స్క్రీన్ లో ఆ మ్యాజిక్ కనిపించదు కానీ మీనాక్షి మాత్రం తెర మీద కన్నా ఆఫ్ స్క్రీన్ ఫోటో షూట్స్ లో మరింత అందంగా కనిపిస్తుంది.

లేటెస్ట్ గా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గ్లింప్స్ రిలీజ్ టైంలో కూడా తన లుక్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది మీనాక్షి. శారీ లో అమ్మడు అందాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదంటే నమ్మాల్సిందే అనేలా ఉంది. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ మీనాక్షి చేస్తున్న ఈ మ్యాజిక్ చూసిన ఎవరైనా సరే కచ్చితంగా అమ్మడు టాప్ రేంజ్ కి వెళ్తుందని ఒప్పుకుంటారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com