బెట్టింగ్ యాప్ నిందితుల జాబితాలో యజమానులు
బెట్టింగ్ యాప్‌ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్‌లో నమోదైన కేసులో భాగంగా యాప్‌ల యజమానులను పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ లిస్టులో మొత్తం 19 యాప్‌ల యజమానులున్నారు. జిగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్‌ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యాప్‌ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ యాప్‌ల యజమానులకు నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదు చేశారు. తాజాగా యాప్‌ల యజమానులపై కేసులు పెట్టారు.