Sunday, November 17, 2024

మీరే నాకు ముఖ్యం

మీ కోసం జైలుకైనా పోతా
ఆదిలాబాద్ స‌భ‌లో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

రాష్ట్రంలో అరాచ‌క పాల‌న న‌డుస్తుంద‌ని, ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నార‌ని, ప్ర‌జ‌లు, రైతుల కోసం జైలుకు పోవ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను ఉరికించి కొట్టే రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైత‌న్న‌ల ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌నలో అన్ని ప‌నులు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయని, రైతులు, మ‌హిళ‌లు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధ‌ర్నా చేస్తున్నారన్నారు. అఖ‌రికి కాంగ్రెస్ పాల‌న‌లో పోలీసోళ్ల భార్య‌లు ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని, వారు కూడా పోలీసోళ్ల చేతిలో దెబ్బ‌లు తినే ప‌రిస్థితి ఉంద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

చీటింగ్ కేసు పెడితే భ‌య‌ప‌డుతానా..?
ప్ర‌జల కోసం పోరాటం చేస్తుంటే బెదిరిస్తున్నార‌ని, తాను జైలుకు పోవ‌డానికి రెడీగా ఉన్నాన‌ని, ప్ర‌జ‌లు, రైతుల కోసం ఒక‌ట్రెండు ఏండ్లు జైల్లో ఉండేందుకు సిద్ధమ‌ని కేటీఆర్ చెప్పారు. ఎవ‌నీ అయ్య‌కు భ‌య‌ప‌డేది లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు చీటింగ్ కేసులు సీఎం మీద పెట్టాలనొ, తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన ఈ చార్ సౌ బీస్‌గాని మీద కేసులు పెట్టాలన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి, రుణ‌మాఫీ చేయ‌నందుకు రైతులు కేసులు పెట్టాలని, 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ని చెప్పి ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌నందుకు యువ‌త కేసులు పెట్టాలని, ఇలా అన్ని వ‌ర్గాలు పోలీసు స్టేష‌న్ల ముందు లైన్లు క‌ట్టి చీటింగ్ కేసు పెడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కుడు కూడా ఈ రాష్ట్రంలో మిగల‌డు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాను పోలీసుల‌ను కోరుతున్నానని, అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదని, ఇలాంటి కిరాత‌క ప‌నులు బీఆర్ఎస్ పాల‌న‌లో చేయ‌లేదన్నారు. మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కావ‌ద్ద‌ని, న్యాయం, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని, పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో స‌హా ఇస్తామ‌న్నారు. రేవంత్ రెడ్డి రాజు, చ‌క్ర‌వ‌ర్తి కాదని, చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నాయ‌కుల‌తోనే కొట్లాడినమ‌ని, ఈ చిట్టినాయుడు.. గింతంత మ‌నిషి.. వాని చూసి ఆగం కావొద్దని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular