Friday, December 27, 2024

మెట్రో ఎండితో మంగోలియన్ ప్రభుత్వ సీనియర్ అధికారుల భేటీ

మెట్రో ఎండితో మంగోలియన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. ఏఎస్‌సిఐ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో ‘ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్స్ (పిపిపి)‘కి హాజరైన మంగోలియన్ ప్రభుత్వ సీనియర్ అధికారులు గురువారం మెట్రో రైలు భవన్‌లో మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డితో సమావేశమై మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక చిక్కులు, డాక్యుమెంటేషన్ వివరాలు, చట్టపరమైన సమస్యలు, పిపిపి పద్ధతిలో నిర్మాణ అనుభవాల గురించి తెలుసుకున్నారు.

ఈ భేటీలో భాగంగా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసాధారణమైన నిర్వహణ పద్ధతుల గురించి ఎండి ఎన్‌విఎస్ రెడ్డి అవగాహన కల్పించారు. హైదరాబాద్ ప్రాజెక్టును అమలు చేయడంలో సున్నితమైన సమస్యలను పరిష్కరించడం, అనేక సవాళ్లను పరిష్కరించడం, సంక్లిష్ట వాతావరణం, క్లిష్ట పరిస్థితుల్లో మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టును రూపకల్పన చేయడం గురించి ఎండి వారికి వివరించారు.

మంగోలియా రాజధాని నగరం ఉలాన్‌బాతర్ (ఉలాన్ బాటోర్)లో మెట్రో రైలును నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించగా దానికి సంబంధించి విధి, విధానాల గురించి మంగోలియా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గురువారం మెట్రోరైలు ఎండితో భేటీ అయ్యింది. మంగోలియన్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన దాదాపు 20 మంది సీనియర్ అధికారులతో కూడిన ఈ అధ్యయన బృందానికి మంగోలియా కేబినెట్ సెక్రటేరియట్‌కు చెందిన పురేవ్‌సురెన్ సరాంగెరెల్ నాయకత్వం వహించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com