Wednesday, May 28, 2025

మీరు ఇచ్చింది తప్పుడు నివేదిక మేడిగడ్డ ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుపై ఎల్‌అండ్‌టీ సంచలన లేఖ

మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజీ నాణ్యతపై రిపోర్టు ఇచ్చిన నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ (NDSA)కి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంచలన లేఖ రాసింది. మేడిగడ్డపై ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయాంలో నిర్మితమైన మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్‌ కుంగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజీ నాణ్యతపై రిపోర్టు ఇచ్చిన నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీకి బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంచలన లేఖ రాసింది. మేడిగడ్డ విషయంలో ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. మరోవైపు అసలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీపై రిపోర్టును ఎలా ఇస్తారంటూ తీవ్రంగా ప్రశ్నించింది.
తాము నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యం చెందిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే తగిన సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటిది ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే గుడ్డిగా బ్యారేజ్ పరిస్థితిని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించింది. గ్రౌటింగ్ కారణంగా పరీక్షలు చేయలేదంటూ ఎన్‌డీఎస్‌ఏ తన రిపోర్టులో పలుచోట్ల తెలిపిందని, అలాంటప్పుడు బ్యారేజీ ఫెయిల్ అంటూ రిపోర్డు ఇవ్వడం ఏ విధంగా సరైనదని ఎల్‌అండ్‌ టీ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ విషయానికి సంబంధించి రిపోర్టులోని పేజీ నెం.283లో క్వాలిటీ కంట్రోల్ రిపోర్టును ఎల్ అండ్ టీ సమర్పించిందని పేర్కొంటూనే.. పలుచోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ప్రస్తావించడం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. బ్యారేజీ పునరుద్ధరణ విషయంలోనూ ఇది వరకే ఒకసారి ఎన్‌డీఎస్‌ఏతో పాటు రాష్ట్ర నీటి పారుదుల శాఖకు లేఖలు రాశామన్న ఎల్‌ అండ్‌ టీ ఎలాంటి సాంకేతిక పరీక్షలు చేపట్టకుండా బ్యారేజీ వైఫల్యాన్ని ఎత్తిచూపడం, లోపం ఉందని రిపోర్టు ఇవ్వడం సరైంది కాదని లేఖలో ప్రస్తావించింది.
అయితే మేడిగడ్డ బ్యారేజీ తో పాటు, కాళేశ్వరంపై నిర్మించిన బ్యారేజీ నిర్మాణాల్లో లోపాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ సంబంధిత నిర్మాణాల వద్ద పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూనే డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాంతాల్లో కాకుండా మరోచోట మేడిగడ్డ, సుందిల్ల బ్యారేజీలను నిర్మించారని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. మరోవైపు బ్యారేజీలు కట్టే ముందు కనీసం జియోలజికల్, జియో టెక్నికల్ టీమ్స్‌తో అక్కడ ఎలాంటి భూ పరీక్షలు నిర్వహించలేదని నివేదికలో వెల్లడించింది. అవేం లేకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మించడం వల్ల బ్యారేజీలో సాంకేతిక సమస్యలతో పాటు డ్యామేజ్ జరిగిందని పేర్కొన్నారు. కాగా కుంగిన ఏడో బ్లాకును పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ తన నివేదికలో సిఫారసు చేసింది. కాగా ప్రస్తుతం ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టును ఎల్‌ అండ్‌ టీ తప్పు పట్టడంతో దీనిపై ఎన్‌డీఎస్‌ఏ, ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com