Wednesday, April 2, 2025

చిరంజీవి 157లో గ్యాంగ్‌ వీళ్లే

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ #మెగా157 పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవిని ఫుల్ లెంత్ హ్యుమర్ రోల్ లో ప్రజెంట్ చేయనుంది. అనిల్ రవిపూడి పక్కా ఎంటర్‌టైనర్స్ తెరకెక్కించడంలో ప్రత్యేకమైన పట్టు కలిగిన దర్శకుడు మాత్రమే కాకుండా, సినిమాలను ప్రమోట్ చేయడంలోనూ డిఫరెంట్, క్రియేటివ్ ప్రమోషన్స్ తో అలరిస్తుంటారు. ఇటీవల “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాన్ని విభిన్నమైన రీతిలో ప్రమోట్ చేసి విజయం సాధించిన అనిల్ రావిపూడి, అదే స్థాయిలో #మెగా157కి కూడా ఇన్నోవేటివ్ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రమోషన్‌లో భాగంగా, చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలతో ఒక వినూత్నమైన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో మెగా అభిమానులకు నోస్టాల్జిక్ అనుభూతిని కలిగించడంతో పాటు, #మెగా157 మూవీ టీంని ఫన్ ఫుల్ గా పరిచయం చేసింది. వీడియో ప్రారంభంలో, దర్శకత్వ విభాగం చిరంజీవి వినోదాత్మక టైమింగ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. రచయితలు అజ్జు మహాకాళి, తిరుమల నాగ, ఉపేంద్ర తమ రైటింగ్ తో “డైమాండ్స్”లా పనిచేస్తామని సరదాగా చెప్పారు. రచయిత నారాయణ అయితే అనిల్ రవిపూడి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని హిట్లర్ లా ప్రశ్నిస్తానని సరదాగా చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రచయిత ఎస్. కృష్ణ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ తనను తాను “మేస్త్రీ”గా పేర్కొంటూ ఎంట్రీ ఇచ్చారు. ఎడిటర్ తమ్మిరాజు అవసరం లేని సీన్స్ మాత్రమే కట్ చేస్తానని సరదాగా చెప్పారు. డి.ఓ.పీ సమీర్ రెడ్డి “జెట్ స్పీడ్”లో షూట్ చేస్తానని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో మాస్టర్ పాటపాడుతూ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి స్వయంగా “గోదారి గట్టు” పాట నుండి కొన్ని లైన్స్ ఆలపించడం అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నిర్మాతలు సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ప్రేక్షకులకు బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ అందిస్తామని హామీ ఇచ్చారు. చిరంజీవి తనదైన శైలిలో సుష్మిత ‘కొణిదెల’ ఇంటిపేరు నిలబెట్టాలి అని సరదాగా చెప్పడం ఆకట్టుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com