Sunday, June 15, 2025

సైలెంట్‌గా మెగా డాటర్‌ నిశ్చితార్ధం

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందనేది ఈ వార్త సారాంశం. నిహారిక కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూస్తుంటే ఏదో శుభకార్యం, ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తోంది.ఈ ఫొటోలో నిహారిక పట్టుచీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆమె చేతులకు గోరింటాకు పెట్టుకుని ఉండగా, తలలో మల్లె పూలు ధరించి కూర్చున్నట్లుగా ఉంది. ఈ దృశ్యం కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యం జరగబోతోందా లేదా జరిగిందా అన్న సందేహాలను లేవనెత్తుతోంది. నిహారిక తన స్టోరీలో ఈ ఫోటోను ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో, దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలియడం లేదు. అయినప్పటికీ, ఈ ఫొటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com