Sunday, May 4, 2025

మెగా హీరోతో శ్రీలీల స్పెప్పులు

శ్రీలీల.. టాలీవుడ్‌ సెన్సేషన్ గా మారింది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ. తెలుగు, తమిళ్ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఐటం సాంగ్స్ లో హీరోయిన్స్ నటించడం ట్రెండ్ గా మారింది. టాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మెగా హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. దీంతో ఈసారి థియేటర్లు దద్దరిల్లడం పక్కా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు నెక్స్ట్ స్టెప్పులు వేయబోయేది మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో అని తెలుస్తోంది. రామ్ చరణ్‌ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా టాక్ న‌డుస్తుంది. సినిమా నుంచి రిలీజ్ గ్లింప్స్‌ లో ఫుల్ గా జుట్టు, గడ్డంతో చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించారు. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com